Myanmar: శిథిలాల కింద సజీవంగా ఓ గర్భిణీ! 4 d ago

మయన్మార్ భూకంపం విపత్తులో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.. విపత్తు సంభవించిన మూడు రోజుల తర్వాత శిథిలాల కింద సహాయక సిబ్బంది ఓ గర్భిణీని సజీవంగా గుర్తించారు. మాండలేలోని గ్రేట్ వాల్ హోటల్ శిథిలాల నుంచి ఆమెను బయటకు తీసినట్లు అధికారులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు బయటకు తీసినవారిలో ఒక్క మహిళ తప్ప ఎవరూ ప్రాణాలతో లేరని అధికారులు పేర్కొన్నారు.